పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా వంశీ రామ్మోహన్ బుర్రా పేరు ఖరారైంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి (పీఈఎస్‌బీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన అదే సంస్థలో ఫంక్షనల్ డైరెక్టర్(ప్రాజెక్ట్స్)గా పనిచేస్తున్నారు. వంశీకి విద్యుత్తు, టెలికాం రంగాల్లో మూడు దశాబ్దాల విస్తృత అనుభవం ఉంది. ఇది వరకు పవర్‌గ్రిడ్ టెలిసర్వీసెస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గానూ సేవలందించారు.