Published on Sep 13, 2025
Current Affairs
పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి
పాలస్తీనాకు ప్రత్యేక దేశ ప్రతిపత్తి

పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ చేసిన తీర్మానానికి భారత్‌ 2025, సెప్టెంబరు 12న మద్దతు తెలిపింది.

193 సభ్యులు కలిగిన సర్వసభ్య సభలో భారత్‌తో సహా 142 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి.

10 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి.

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడంతోపాటు ఇజ్రాయెల్, పాలస్తీనాలు తమ మధ్య ఉన్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న న్యూయార్క్‌ డిక్లరేషన్‌ను తీర్మానం సమర్థించింది.