2024 సంవత్సరానికి సంబంధించిన ‘పులుల గణన వార్షిక’ నివేదికను ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ తాజాగా విడుదల చేశారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు (ఎన్‌ఎస్‌టీఆర్) ప్రాంతంలో 2024లో పులుల సంఖ్య 76కు చేరిందని అటవీ శాఖ అధికారులు లెక్కగట్టారు.
వీటిలో 40 ఆడ పులులు కాగా 32 మగవి అని చెప్పారు.
మరో నాలుగింటి జెండర్‌ను గుర్తించలేకపోయారు.
అలాగే వీటితో పాటు మరో 11 పులి కూనలూ ఉన్నట్లు వివరించారు. 2
023లో వీటి సంఖ్య 74గా ఉంది.
2018 నాటికి ఈ రిజర్వులో 47 పులులే ఉండేవి.
ఈ ఆరేళ్ల వ్యవధిలో 29 పెరిగింది.
అంటే 61.70 శాతం మేర పెరిగినట్లయింది.