ఇండోనేసియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆ దేశ కమ్యూనికేషన్, డిజిటల్ వ్యవహారాల మంత్రి ముత్య హఫీద్ వెల్లడించారు. కొత్త నిబంధనలు 2026, మార్చి 28 నుంచి దశలవారీగా అమలులోకి రానున్నాయి. ఈ ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన అకౌంట్లు కొన్ని ప్రముఖ సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫార్మ్‌లలో నిలిపివేస్తారు.