Published on Nov 16, 2024
Government Jobs
పల్నాడు జిల్లాలో సోషల్ వర్కర్, అకౌంటెంట్ పోస్టులు
పల్నాడు జిల్లాలో సోషల్ వర్కర్, అకౌంటెంట్ పోస్టులు

నరసరావుపేటలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద/ అవుట్‌ ట్ సోర్సింగ్ ప్రాతిపదికన పల్నాడు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 8. 

వివరాలు:

1. హౌస్ కీపర్: 01 పోస్టు
2. సోషల్ వర్కర్: 01 పోస్టు
3. అకౌంటెంట్: 01 పోస్టు
4. అవుట్‌రీచ్ వర్కర్: 01 పోస్టు
5. ఆయా: 04 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 7వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 02/12/2024.

Website:https://palnadu.ap.gov.in/