పోలండ్ అధ్యక్ష ఎన్నికల్లో కన్సర్వేటివ్ నేత కరోల్ నౌరోకీ (42) విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఆ దేశ ఎలక్షన్స్‌లో ఆయన లిబరల్ నాయకుడు, వార్సా మేయర్ రఫల్ ట్రస్కోవ్‌స్కీపై గెలుపొందారు. నౌరోకీకి 50.89 శాతం, ట్రస్కోవ్‌స్కీకి 49.11 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నౌరోకీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతిచ్చారు.