Published on Oct 3, 2024
Current Affairs
ప్లూటో చంద్రుడిపై వాయువులు
ప్లూటో చంద్రుడిపై వాయువులు

మరుగుజ్జు గ్రహం ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన ‘చరోన్‌’పై కార్బన్‌ డయాక్సైడ్‌ (బొగ్గుపులుసు వాయువు), హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాయువుల ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. బాహ్య సౌర వ్యవస్థలో మంచు ఎలా ఆవిర్భవించిందీ, ఆ తర్వాత ఎలాంటి మార్పులకు లోనయిందీ అర్థం చేసుకునేందుకు ఈ పరిణామం దోహదపడే అవకాశాలు ఉన్నాయి. 

అమెరికాలోని సౌత్‌వెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం తాజాగా ఆ జాబిల్లిపై కార్బన్‌ డయాక్సైడ్, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లను గుర్తించింది.