ఆరోగ్యరంగంలో దశాబ్దాలుగా వినిపించే ‘పారా మెడికల్’ అనే పదాన్ని ఇక వాడొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. నేషనల్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్ల చట్టం- 2021 ప్రకారం ఇకపై అన్ని ప్రభుత్వ, విద్య, ఆరోగ్య సంబంధిత వ్యవస్థల్లో ‘అలైడ్ అండ్ హెల్త్‌కేర్’ (ఆరోగ్య సంరక్షణ సహాయకులు) అనే పదాన్ని అధికారికంగా వాడాలని కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2025, జులై 3న ఉత్వర్వులు జారీ చేసింది.