Published on Nov 1, 2025
Current Affairs
ప్రొ కబడ్డీ టైటిల్‌ విజేత దిల్లీ
ప్రొ కబడ్డీ టైటిల్‌ విజేత దిల్లీ

ప్రొ కబడ్డీ సీజన్‌-12 విజేతగా దిల్లీ నిలిచింది. 2025, అక్టోబరు 31న దిల్లీ త్యాగరాజ్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దబంగ్‌ దిల్లీ 31-28తో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. దిల్లీకి ఇది రెండో పీకేఎల్‌ టైటిల్‌. 2021లో తొలిసారి టైటిల్‌ గెలిచింది. 12 సీజన్లలో పట్నా పైరేట్స్‌ అత్యధికంగా మూడుసార్లు నెగ్గింది. దిల్లీ, జైపుర్, రెండేసి టైటిళ్లు సాధించగా.. యు ముంబా, పుణెరి పల్టాన్, హరియాణా స్టీలర్స్, బెంగళూరు బుల్స్, బెంగాల్‌ వారియర్స్‌ ఒక్కో ట్రోఫీ నెగ్గాయి.