పెరూ దేశ అధ్యక్షుడిగా 2026, ఫిబ్రవరి 19 మాజీ న్యాయమూర్తి జోస్ మారియా బల్కజార్(83) ఎన్నికయ్యారు. 10 ఏళ్లలో ఈయన 8వ అధ్యక్షుడు. అవినీతి ఆరోపణల కారణంగా తాత్కాలిక అధ్యక్షుడు జోస్ జెరీని తొలగించిన మరుసటి రోజే ఈ ఎన్నిక జరిగింది. వామపక్ష పెరూ లిబ్రె పార్టీ తరఫున పోటీ చేసిన బల్కాజార్, 130 మంది సభ్యులున్న చట్టసభలో ముగ్గురు ఇతర అభ్యర్థులను ఓడించి విజేతగా నిలిచారు.