Published on Dec 12, 2025
Current Affairs
పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ఏఐ
పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ఏఐ

2025 ఏడాదికిగానూ ‘పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా ‘ఆర్కిటెక్ట్స్‌ ఆఫ్‌ ఏఐ’ని (ఏఐ సృష్టికర్తలు) ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజీన్‌ టైమ్‌ ప్రకటించింది. 2025ను ఏఐ ఏడాదిగా అభివర్ణించిన ఈ మ్యాగజీన్‌.. దాని శక్తి ప్రపంచానికి స్పష్టంగా కనిపించిందని పేర్కొంది. ఏఐ మన జీవితాలను మార్చడంలో, ఆశ్చర్యపరచడంలో, ఆందోళన కలిగించడంలో ప్రధాన పాత్ర పోషించిందని వివరించింది.