‘ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడిగా విశాఖకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ డి.ప్రసన్న కుమార్ ఎన్నికయ్యారు. ఆయన ఇప్పటి వరకు ఐసీఏఐ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఏపీ నుంచి ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తి ఈయనే. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నెడంబరం గ్రామం ఆయన స్వస్థలం. సీఏలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 1985లో విశాఖలో స్థిరపడ్డారు.