పారిశ్రామిక వివాదాల చట్టం-1947లో పేర్కొన్న ‘పరిశ్రమ’ అనే పదాన్ని నిర్వచించే ప్రక్రియను సుప్రీంకోర్టు 2026, మార్చి 17న ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది.
ఇదే అంశంపై 1978లో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు సరైనదో కాదో పరిశీలిస్తామని విస్తృత ధర్మాసనం తెలిపింది.