ఐడబ్ల్యూఎఫ్ ప్రపంచ యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు పర్వ్ చౌదరి కాంస్యం నెగ్గాడు. 2025, మే 5న లిమా (పెరూ)లో జరిగిన యూత్ బాలుర 96 కేజీల విభాగంలో అతడు స్నాచ్‌లో 140 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 175 కేజీలు ఎత్తాడు. మొత్తంగా 315 కేజీలు లిఫ్ట్ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో భారత్‌కు దక్కిన మూడో పతకమిది. ఇంతకుముంద జోత్న్స సబార్ (40 కేజీ), హర్షవర్దన్ సాహు (49 కేజీ) కూడా కాంస్యాలు సొంతం చేసుకున్నారు.