సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్రప్రభుత్వం పొడిగించింది. ఆయన మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతారని 2025, మే 7న ప్రకటించింది.
సీబీఐ నూతన చీఫ్ ఎంపికపై ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్‌గాంధీలతో కూడిన కమిటీ సమావేశమై సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించింది.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. మే 24 నుంచి సూద్ మరో ఏడాది పాటు సీబీఐ అధిపతిగా కొనసాగుతారు.