Published on Sep 1, 2025
Current Affairs
ప్రైవేటు పెట్టుబడులు రూ.2.67 లక్షల కోట్లు
ప్రైవేటు పెట్టుబడులు రూ.2.67 లక్షల కోట్లు

ప్రైవేటు రంగ మూలధన పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో 21.5 శాతం పెరిగి రూ.2.67 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వ్యాసం తెలిపింది.

బలమైన స్థూల ఆర్థిక మూలాలు, 100 బేసిస్‌ పాయింట్ల రేట్ల కోత ఇందుకు దోహదపడతాయని ఆర్‌బీఐ ఆగస్టు బులెటిన్‌లోని ‘ప్రైవేటు కార్పొరేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌: గ్రోత్‌ ఇన్‌ 2024-25 అండ్‌ అవుట్‌లుక్‌ ఫర్‌ 2025-26’ వ్యాసం వివరించింది.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు పెట్టుబడులు రూ.2,20,132 కోట్లుగా నమోదయ్యాయని వెల్లడించింది.