ఆసియా యూత్, జూనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కి చెందిన పర్వ్ చౌదరి రెండు కాంస్య పతకాలు నెగ్గాడు. 2024, డిసెంబరు 24న దోహాలో జరిగిన 96 కేజీల విభాగంలో స్నాచ్‌లో 135, క్లీన్ అండ్ జర్క్‌లో 168 కేజీలు ఎత్తిన పర్వ్ మొత్తంగా 303 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లోనూ అతడికి కంచు దక్కింది.
* ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ 12 పతకాలు గెలుచుకుంది.