Published on Jul 23, 2025
Current Affairs
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌
పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన- నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద ప్రారంభించిన లఖ్‌పతి దీదీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 17,41,362 మంది మహిళలు నమోదు చేసుకున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ 2025, జులై 22న తెలిపారు.

మహారాష్ట్ర (22,69,981 మంది) తర్వాత అత్యధిక మంది లఖ్‌పతి దీదీలు ఏపీలో ఉన్నట్లు చెప్పారు.

ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.414.06 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు.