Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 24, 2026
Current Affairs
పార్లమెంటరీ మైత్రీ బృందాలు
పార్లమెంటరీ మైత్రీ బృందాలు
  • విదేశీ పార్లమెంటు సభ్యులతో సంభాషణల ద్వారా ఆయా దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసే సంకల్పంతో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 2026, ఫిబ్రవరి 23న పార్లమెంటరీ మైత్రీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో 11 మంది సభ్యులు ఉంటారు. మొత్తం 64 దేశాలతో సంబంధాల బలోపేతం కోసం ఇవి ఏర్పాటయ్యాయి. విపక్ష ప్రముఖ నేతలు శశి థరూర్, పి.చిదంబరం, గౌరవ్‌ గొగొయ్, సుప్రియా సూలే, అఖిలేశ్‌ యాదవ్‌ ఈ బృందాలకు ఛైర్‌పర్సన్లుగా నియమితులైనవారిలో ఉన్నారు. భాజపా నుంచి రవిశంకర్‌ ప్రసాద్, బైజయంత్‌ పాండా, నిశికాంత్‌ దుబే, అనురాగ్‌ ఠాకుర్‌లకు ఆ పదవులు దక్కాయి. మొత్తం ఏడు గ్రూపులకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు నేతృత్వం వహించనున్నారు.  
  • ఈ బృందాలు ఆయా దేశాల పార్లమెంటు సభ్యులతో విభిన్న అంశాలపై సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు పంచుకుంటాయి.