మాజీ ప్రధాని వాజ్‌పేయీ 101వ జయంతి సందర్భంగా 2025, డిసెంబరు 25న ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ‘రాష్ట్రీయ ప్రేరణా స్థల్’ను ప్రారంభించారు. 65 ఎకరాల్లో రూ.230 కోట్లతో నిర్మించిన ఈ జాతీయ స్మారకంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయీల విగ్రహాలను ఆవిష్కరించారు. కమలం ఆకారంలో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించారు.
దేశ రాజధానిలోని 11 ఎకరాల పార్కుకు అటల్ బిహారీ వాజ్‌పేయీ సద్భావనా ఉద్యాన్‌గా పేరు పెట్టారు. దిల్లీలో రూ.5కు భోజనం అందించే అటల్ క్యాంటీన్లను ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు. 100 క్యాంటీన్ల ద్వారా రోజూ లక్ష మందికి భోజనం అందించనున్నట్లు ఆమె తెలిపారు.