పర్యావరణంలో హానికరమైన మిథేన్, కార్బన్ డైఆక్సైడ్‌ను శుద్ధమైన జీవ ఇంధనాలుగా మార్చే వినూత్న ప్రక్రియను గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
ఇందుకోసం వారు మెథానోట్రాపిక్ బ్యాక్టీరియాను ఉపయోగించారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాల వల్ల పర్యావరణంపై పడే ప్రభావం, తరగిపోతున్న శిలాజ ఇంధన నిల్వలు అనే రెండు సమస్యలకు విరుగుడును ఈ పరిశోధన కనుగొందని శాస్త్రవేత్తలు తెలిపారు.
మిథేన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే 30 రెట్లు హానికరమని వారు వివరించారు.