మనదేశంలో తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ రేటును ప్రభుత్వం 2025, మే 15న వెల్లడించింది. గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన తొలి నెలవారీ ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం 2025, ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా నమోదైంది.
దేశంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న వ్యక్తుల్లో, ఎంత శాతం మంది నిరుద్యోగంతో ఉన్నారో సత్వరం తెలపడమే ఈ నివేదిక లక్ష్యం.
ఇప్పటిదాకా త్రైమాసికం, వార్షిక వారీ గణాంకాలనే ప్రభుత్వం విడుదల చేసేది.
కరెంట్ వీక్లీ స్టేటస్ (సీడబ్ల్యూఎస్) రూపంలో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం..
మహిళల(5%)తో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువ మంది (5.2%)కి ఉద్యోగం లేదు.
15-29 ఏళ్ల వయసున్న వారిలో నిరుద్యోగ రేటు 13.8 శాతంగా ఉంది.