Published on Jan 9, 2026
Current Affairs
పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌
పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌

ఐఐటీ మద్రాస్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 3.1 పెటాఫ్లాప్‌ పరమ్‌ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చింది. సీ-డాక్‌ రుద్ర సిరీస్‌ సర్వర్లతో దేశంలో తయారైన ఈ వ్యవస్థ ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌పై నడుస్తుందని ఐఐటీ మద్రాస్‌ 2026, జనవరి 8న పేర్కొంది. ఏరోస్పేస్, మెటీరియల్స్, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్‌ డిస్కవరీ లాంటి రంగాల్లో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు కూడా వీలుగా ఉండనుందని పేర్కొంది.