విశ్వం ఎలా ఏర్పడింది, ఎలా పనిచేస్తోంది అన్న అంశంపై నిరంతరం అణు పరిశోధన చేస్తున్న సెర్న్ (యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రిసెర్చ్) సంస్థ మరిన్ని భౌతిక శాస్త్ర రహస్యాల్ని ఛేదించేందుకు ఒక భారీ అణు విచ్ఛిత్తి వ్యవస్థను రూపొందించే ప్రణాళిక సిద్ధం చేసింది.
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దు వద్ద 91 కిలోమీటర్ల భారీ విస్తృతిలో నిర్మించదలచిన ఈ అణు విచ్ఛిత్తి వ్యవస్థకు ‘ఫ్యూచర్ సర్క్యులర్ కొలైడర్’ (ఎఫ్‌సీసీ)గా నామకరణం చేశారు.
ఈ వ్యవస్థ సాయంతో 2040 సంవత్సర మధ్యకల్లా ఇప్పటి వరకూ తెలిసిన భౌతికశాస్త్ర పరిజ్ఞానంపై తిరిగి అధ్యయనం చేసి మరిన్ని కొత్త వివరాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తారు.