ప్రముఖ భారత శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వాంజీ సుతార్ (100) 2025, డిసెంబరు 18న మరణించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్)తో పాటు స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ (కెంపెగౌడ)ల శిల్పాలను ఈయనే రూపొందించారు. పార్లమెంటు ముందు కూర్చొని ఉండే గాంధీ విగ్రహం, ఛత్రపతి శివాజీ విగ్రహం వంటి ఎన్నో ప్రసిద్ధ శిల్పాలకు రూపకర్త సుతార్.