Published on Oct 25, 2024
Admissions
ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరంలో పారా మెడికల్ కోర్సులు
ప్రభుత్వ వైద్య కళాశాల, విజయనగరంలో పారా మెడికల్ కోర్సులు

విజయనగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల 2024-25 విద్యా సంవత్సరానికి కింది పారా మెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివ‌రాలు:

1. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు: 30 సీట్లు

2. డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు: 20 సీట్లు

3. డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు: 10 సీట్లు

4. డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్ కోర్సు: 10 సీట్లు

5. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్‌ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కోర్సు: 20 సీట్లు

అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్‌ (లాంగ్వేజెస్ మార్కులు మినహాయించి) మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు చేయాలి: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను విజయనగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సమర్పించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 29-10-2024.

కౌన్సెలింగ్ ప్రక్రియ, సీట్ల కేటాయింపు: 04-11-2024.

తరగతుల ప్రారంభం: 15-11-2024.

Website:https://vizianagaram.ap.gov.in/