Published on Nov 18, 2024
Current Affairs
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థులు

రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో (గవర్నమెంట్, లోకల్‌ బాడీ) చదువుతున్న విద్యార్థులు 2024లో ఏకంగా 1.29 లక్షలు తగ్గారు. గత విద్యా సంవత్సరం (2023-24)లో 18.13 లక్షల మంది ఉండగా... ఈసారి 16.84 లక్షలకు తగ్గిపోయారని పాఠశాల  విద్యాశాఖ వెల్లడించింది. గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు తదితరాలను కూడా కలిపి మొత్తం ప్రభుత్వ రంగంలోని 30 వేల పాఠశాలలను పరిగణనలోకి తీసుకుంటే అటుఇటుగా 2 లక్షల మంది పిల్లలు తగ్గారని తెలుస్తోంది. 

రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలు మొత్తం 18,254 ఉండగా.. వాటిల్లో 6,90,816 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక్కో బడిలో సగటు పిల్లల సంఖ్య 38 మాత్రమే. ఏకంగా 1864 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ లేకపోవడం గమనార్హం.