ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారుల రిజర్వేషన్‌ను రెండు నుంచి మూడు శాతానికి పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025, ఏప్రిల్ 19న ఉత్తర్వులిచ్చింది. క్రీడల్లో ప్రతిభ కలిగి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించిన వారికి పోటీపరీక్షలు లేకుండా నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వశాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు, పోలీస్, ఎక్సైజ్, అటవీ లాంటి యూనిఫాం శాఖలల్లోనూ క్రీడాకారులకు పెంచిన రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
* క్రీడా విధానం 2024-29లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లను 2 నుంచి 3 శాతానికి పెంచింది.