Published on Aug 30, 2025
Current Affairs
ప్రభుత్వానికి ఎల్‌ఐసీ రూ.7,324 కోట్ల డివిడెండు
ప్రభుత్వానికి ఎల్‌ఐసీ రూ.7,324 కోట్ల డివిడెండు

గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) డివిడెండు రూపేణా ప్రభుత్వానికి రూ.7,324.34 కోట్లను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) చెల్లించింది. ఈ డివిడెండు చెక్కును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టరు (ఎండీ) ఆర్‌ దొరైస్వామి అందజేశారు.