ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. తొలుత గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా, తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా గత 8,931 రోజులుగా ఏకధాటిగా ఆయన అధికారంలో ఉన్నారు.
ఇప్పటివరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8,930 రోజులపాటు అధికారంలో ఉన్నారు. మోదీ 2026, మార్చి 22న దాన్ని అధిగమించారు.