శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండల నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు పరంపరాగత్ అవార్డు లభించింది.
2025, ఫిబ్రవరి 23న దిల్లీలో కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు.
దిల్లీలో ఫిబ్రవరి 7 నుంచి 23 వరకు 38వ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 1300 మంది కళాకారులు పాల్గొనగా, ఆరుగురిని అవార్డుకు ఎంపిక చేశారు.
ప్రథమ స్థానంలో నిలిచిన శివమ్మకు అవార్డు, ప్రశంసాపత్రం, రూ.11 వేల నగదు బహుమతి అందజేశారు.