Published on Nov 10, 2025
Current Affairs
ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌
ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రవీందర్‌ సింగ్‌ స్వర్ణం నెగ్గాడు. 2025, నవంబరు 8న కైరోలో జరిగిన పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో 569 పాయింట్లతో రవీందర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. కిమ్‌ (దక్షిణ కొరియా, 556), ఆంటోన్‌ అరిస్టార్‌కోవ్‌ (రష్యా, 556) వరుసగా రజత, కాంస్య పతకాలు అందుకున్నారు.

50 మీటర్ల పిస్టల్‌ టీమ్‌ విభాగంలో రవీందర్‌ (569), కమల్‌జీత్‌ (540), యోగేశ్‌ కుమార్‌ (537)లతో కూడిన భారత బృందం (1646) రజతం గెలుచుకుంది. దక్షిణ కొరియా (1648) స్వర్ణం, ఉక్రెయిన్‌ (1644) కాంస్యం సాధించాయి.