భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రపంచ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది.
2025, జూన్ 17న ఐసీసీ ప్రకటించిన బ్యాటింగ్ జాబితాలో స్మృతి 727 పాయింట్లతో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
2019 తర్వాత స్మృతి మళ్లీ నంబర్‌వన్ ర్యాంకు సాధించడం ఇదే ప్రథమం.
నటాలీ సీవర్ బ్రంట్ (719- ఇంగ్లాండ్) 2, లారా వోల్వార్ట్ (719- దక్షిణాఫ్రికా) 3 స్థానాల్లో నిలిచారు.
జెమీమా రోడ్రిగ్స్ 15, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 16వ ర్యాంకులు సాధించారు.