Published on May 3, 2025
Current Affairs
ప్రపంచ వృద్ధ మహిళ
ప్రపంచ వృద్ధ మహిళ

ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఎథెల్‌ కేటర్‌హామ్‌(115) నిలిచారు. 116 ఏళ్లు జీవించిన సిస్టర్‌ ఇనా కనబారో లుకాస్‌ ఇటీవల కన్నుమూయడంతో ఇప్పుడు ఎథెల్‌కు ఈ ఘనత దక్కింది. ఆమె 1909 ఆగస్టు 21న జన్మించారు. ప్రస్తుతం ఆమె కేంబెర్లీలో నివసిస్తున్నారు. ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా గడపడమే తన సుదీర్ఘ జీవితం వెనుక ఉన్న రహస్యమని ఎథెల్‌ చెప్పారు.