2025లో జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ కోసం ఫిడే రూ.9.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఫార్మాట్లోనూ మార్పులు చేసింది. అంతర్జాతీయ చెస్ క్యాలెండర్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఒకటైన ఈ ఛాంపియన్‌షిప్‌కు దోహా ఆతిథ్యమివ్వనుంది. ర్యాపిడ్ టోర్నీ ఫార్మాట్‌ను మార్చలేదు. ఓపెన్ విభాగంలో 13 రౌండ్లు, మహిళల విభాగంలో 11 రౌండ్లు ఉంటాయి. తొలి స్థానం కోసం టై ఏర్పడితే ప్లేఆఫ్ నిర్వహిస్తారు. బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్‌లో కొత్తగా నాకౌట్ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టారు.