- తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశి ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన హంపి.. మూడో స్థానంలో నిలిచింది. అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా (రష్యా)కు స్వర్ణం, జు జినెర్ (చైనా)కు రజతం దక్కాయి.
- ప్రపంచ ర్యాపిడ్ చెస్‌లో అయిదు పతకాలు నెగ్గిన తొలి ప్లేయర్‌గా హింపి రికార్డు సాధించింది. ఆమె స్వర్ణం (2019, 2024), రజతం (2023), కాంస్యం (2012, 2025) సాధించారు.