ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని (World Theatre Day) ఏటా మార్చి 27న నిర్వహిస్తారు. నాటకాలు, కళల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961, మార్చి 27న మొదటిసారి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ (ఐటీఐ) నిర్వహించింది.
రంగస్థల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతోపాటు సమాజంపై దాని ప్రభావాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐటీఐ ఈ రోజును ప్రారంభించింది.
ఐటీఐ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నాటక ప్రదర్శన సంస్థ. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) 1948లో స్థాపించింది.