భవిష్యత్తులో తలెత్తే మహమ్మారులను సమర్థంగా, సమైక్యంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సభ్యదేశాలు తొలిసారిగా 2025, మే 20న ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కొవిడ్-19 సంక్షోభం అనంతరం మూడేళ్లుగా సాగుతున్న చర్చలకు పర్యవసానంగా ఈ ఒప్పందం కుదిరింది.
‘డబ్ల్యూహెచ్‌వో ప్యాండమిక్ అగ్రీమెంట్’కు ప్రపంచ ఆరోగ్య సమ్మేళనం ప్లీనరీ సమావేశం ఆమోదం తెలిపింది.
ఈ ఒప్పందంపై జరిగిన ఓటింగులో 124 దేశాలు అనుకూలంగా ఓటేయగా, 11 దేశాలు గైర్హాజరయ్యాయి.
దీనిపై ఏ ఒక్క దేశమూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.