భారత స్టార్ క్యూయిస్ట్ సౌరవ్ కొఠారి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ (టైమ్డ్ ఫార్మాట్)ను సొంతం చేసుకున్నాడు. 2025, ఏప్రిల్ 17న కార్లో, ఐర్లాంగ్‌లో జరిగిన ఫైనల్లో కొఠారి 725-480 పాయింట్లతో పంకజ్‌పై విజయం సాధించాడు. సౌరవ్ తండ్రి మనోజ్ కొఠారి కూడా టైమ్డ్ ఫార్మాట్‌లో 1990లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో భారత ఆటగాళ్లే నిలిచారు. ధ్రువ్ సిత్వాల మూడో స్థానం దక్కించుకున్నాడు.