ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ కాంస్యం నెగ్గింది. 2025, ఆగస్టు 30న పారిస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఈ జంట 19-21, 21-18, 12-21తో 11వ సీడ్ చెన్ బోయాంగ్ - లి యి జంట చేతిలో ఓడిపోయింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్ జోడీకి ఇది రెండో పతకం. 2022లోనూ ఈ భారత జంట కాంస్యమే నెగ్గింది.