Published on Mar 1, 2025
Current Affairs
ప్రపంచ బ్యాంక్‌ నివేదిక
ప్రపంచ బ్యాంక్‌ నివేదిక

2047 నాటికి భారత్‌ అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే సగటున 7.8% వార్షిక వృద్ధి రేటు అవసరమని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదిక అయిన ‘బికమింగ్‌ ఏ హై-ఇన్‌కమ్‌ ఎకానమీ ఇన్‌ ఏ జెనరేషన్‌’లో అభిప్రాయపడింది.

ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఆర్థిక రంగంతో పాటు భూమి, కార్మిక విభాగాల్లో సంస్కరణలు అవసరమని పేర్కొంది. 

2000 సంవత్సరం నుంచి 2024 మధ్య మనదేశం సగటున 6.3% వృద్ధి సాధించింది. భవిష్యత్‌ లక్ష్యాలు సాధించేందుకు అవసరమైన బలమైన పునాదులను భారత్‌ వేసిందని నివేదిక వెల్లడించింది.

సాధారణ పరిస్థితుల్లో ఇటువంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను సాధించడం సాధ్యపడదని, స్థూల తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయుల నుంచి దాదాపు 8 రెట్లు పెరగాల్సి ఉంటుందని వివరించింది.

వృద్ధి మరింత పెరిగి, వచ్చే రెండు దశాబ్దాల పాటు అధికంగానే ఉండాలని, కొన్ని దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయని పేర్కొంది.