Published on Sep 2, 2024
Current Affairs
ప్రపంచ బధిరుల షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌
ప్రపంచ బధిరుల షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌

హైదరాబాద్‌ షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్‌ ప్రపంచ బధిరుల షూటింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రపంచ రికార్డుతో పసిడి నెగ్గాడు. 2024, సెప్టెంబరు 1న హానోవర్‌ (జర్మనీ)లో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో అతను ఛాంపియన్‌గా నిలిచాడు. క్వాలిఫికేషన్లో 632.7 స్కోరుతో ప్రపంచ రికార్డు (625.1)ను బద్దలుకొట్టాడు. ఫైనల్లో 215.7 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.