ప్రపంచ బాక్సింగ్ కప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా హితేశ్ గులియా చరిత్ర సృష్టించాడు.
గాయం కారణంగా ప్రత్యర్థి ఒదెల్ కమరా (ఇంగ్లాండ్) 70కేజీ ఫైనల్లో వాకోవర్ ఇవ్వడంతో హితేశ్ విజేతగా నిలిచాడు.
మరో భారత బాక్సర్ అభినాష్ జమ్వాల్ (65కేజీ) రజతం నెగ్గాడు. ఫైనల్లో అతడు బ్రెజిల్‌కు చెందిన యురి రీస్ చేతిలో ఓడిపోయాడు.
భారత్ మొత్తం ఆరు పతకాలతో ప్రపంచ బాక్సింగ్ కప్‌ను ముగించింది.