ప్రపంచ పారా బ్యాడ్మింటన్‌లో ఆరుసార్లు సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి ఆటగాడిగా భారత పారా షట్లర్ ప్రమోద్ భగత్ రికార్డు సృష్టించాడు. 2026, ఫిబ్రవరి 14న ఎస్‌ఎల్3 విభాగం పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతడు 21-12, 21-18తో మహ్మద్ ఇమ్రాన్ (ఇండోనేసియా)ను ఓడించాడు. అతడికిది వరుసగా నాలుగో ప్రపంచ టైటిల్. ప్రమోద్ 2009, 2015, 2019, 2022, 2024లోనూ టైటిల్ సొంతం చేసుకున్నాడు.