ప్రపంచ పారా అథ్లెటిక్స్‌లో మహిళల క్లబ్ త్రో (ఎఫ్51)లో ఏక్తా భ్యాన్ రజతం గెలుచుకుంది.
2025, అక్టోబరు 4న దిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఆరో ప్రయత్నంలో 19.80మీ త్రోతో ఆమె రెండో స్థానంలో నిలిచింది.
ఉక్రెయిన్‌కు చెందిన జోయా ఓవ్‌సిల్ (24.03) స్వర్ణం నెగ్గగా.. తటస్థ అథ్లెట్ ఏక్తరినా పొటపోవా (18.60) కాంస్యం సొంతం చేసుకుంది.
ఏక్తా గత ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించింది.
పురుషుల షాట్‌పుట్ (ఎఫ్57)లో సోమన్ రాణా రజతం సొంతం చేసుకున్నాడు.
అతడు ఈ సీజన్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (14.69మీ) చేశాడు.
యాసిన్ ఖోస్రవి (ఇరాన్, 16.60మీ) స్వర్ణం, కూపిక (ఫిన్లాండ్, 14.51మీ) రజతం సాధించారు.