Published on Jun 6, 2025
Current Affairs
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో ఏటా జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తారు.

మనం నివసించే పరిసరాలే పర్యావరణం.

ఇది ‘ఎన్విరాన్‌’ అనే ఫ్రెంచ్‌ భాషా పదం నుంచి వచ్చింది.

దీని అర్థం మన చుట్టూ ఉన్న ప్రాంతం.

ఇందులో జీవ, నిర్జీవ అంశాలు భాగంగా ఉంటాయి.

భూగోళంపై సమస్త ప్రాణికోటి మనుగడకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అవసరం.

అయితే మానవ కార్యకలాపాలు, విపత్తులు మొదలైనవి పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

దీంతో పరిసరాలతోపాటు జీవవైవిధ్యం కూడా తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. పర్యావరణ సమస్యలు, సవాళ్ల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

యూఎన్‌ఓ ఆధ్వర్యంలో 1972, జూన్‌ 5 - 16 మధ్య స్టాక్‌హోం (స్వీడన్‌)లో మొదటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు జరిగింది.

పర్యావరణ సమస్యలను పరిష్కరించేందుకు జూన్‌ 5న ‘ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్‌ఈపీ)’ను ఏర్పాటు చేశారు.

దీనికి గుర్తుగా 1973 నుంచి ఏటా ఆ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.

2025 నినాదం: End Plastic Pollution