Published on May 5, 2025
Current Affairs
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నిష్పక్షపాతంగా వార్తలు అందించే జర్నలిస్టులను గౌరవించడంతోపాటు పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
యునెస్కో 1991 ఏప్రిల్‌ 29 నుంచి మే 3 వరకు నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో ‘ఆఫ్రికాలో పత్రికా స్వేచ్ఛ, స్వతంత్రం’ అనే అంశంపై సెమినార్‌ నిర్వహించింది. మే 3న పత్రికల స్వేచ్ఛ కోసం కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. దాన్నే విండ్‌హోక్‌ డిక్లరేషన్‌గా పేర్కొంటారు. దీనికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 3న ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’గా జరుపుకోవాలని 1993, డిసెంబరులో యూఎన్‌ఓ జనరల్‌ అసెంబ్లీ తీర్మానించింది. 1994 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.
2025 నినాదం: Reporting in the Brave New World: The Impact of Artificial Intelligence on Press Freedom and the Media