జాతీయ భద్రత సలహాదారు అజీత్ డోభాల్ అధ్యక్షతన 2025, మార్చి 16న దిల్లీలో ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సు జరిగింది.
ఉగ్రవాదం, అధునాతన సాంకేతికత ద్వారా ఎదురవుతున్న భద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన విధానాలపై ఇందులో చర్చించారు.
ఈ సదస్సులో అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ , కెనడా నిఘాధిపతి డేనియల్ రోజర్స్, యూకే జాతీయ భద్రత సలహాదారు జొనాథన్ పొవెల్ తదితరులు పాల్గొన్నారు.