6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2024 డిసెంబరు 28న విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి.
మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రధాన ఆశయంతో వీటిని నిర్వహిస్తున్నట్లు మహాసభల గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు.
దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా రచయితలు, కవులు ఈ సభల్లో పాల్గొన్నారు. 2024, డిసెంబరు 29న ఈ సమావేశాలు ముగిశాయి.