- మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 2026, జనవరి 3న ప్రారంభమమయ్యాయి. మాతృభాషను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు. జనవరి 4న మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్‌బీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజులుపాటు సాగిన కార్యక్రమం జనవరి 5న ముగిశాయి.
- తెలుగు భాషకు సేవలందించిన పలువురు ప్రముఖులకు మహాసభల్లో పూర్ణకుంభ పురస్కారాల ప్రదానం జరిగింది. శాసనసభ సభాపతి అయ్యన్నపాత్రుడి చేతుల మీదుగా దర్శకుడు కె.విశ్వనాథ్ తనయుడు నాగేంద్ర, తూర్పుబాగోతం కళాకారుడు శంకర్రావు, సినీనటుడు ఏడిద శ్రీరాం, బుర్రా సాయిమాధవ్, గద్దర్ కుమార్తె వెన్నెల, తోలుబొమ్మల కళాకారుడు చిదంబరం, పొత్తూరు రంగారావు తదితరులను సత్కరించారు.